పిఠాపురం, (జనస్వరం) : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు.అందుకే దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.తన ఓటు హక్కుతో నచ్చినవారిని అందలం ఎక్కించగలరు. నచ్చకపోతే పదవిలో నుంచి దింపేయగలరు. ఎంతో విలువైన ఈ ఓటు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు అనే బ్రహ్మాస్త్రంతో శాసించగలిగే హక్కును మనరాజ్యాంగం కల్పించింది. ప్రభుత్వాలను మార్చే సత్తా ఒక్క ఓటుకే ఉంది. ఎన్నికల్లో ఓటు ఒక ఆయుధంగా పని చేస్తుంది. ఓటుకు ప్రభుత్వాలను మార్చే శక్తి ఉంది. అతిపెద్దప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ఓటరుకు ఓప్రత్యేక స్థానం ఉంది. తన ఓటు హక్కుతో శాసించగల శక్తి ఉంది. పార్లమెంట్, అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఎంతో విలువైన ఓటు హక్కు ఓ వజ్రాయుధం. ప్రతి ఒక్కరు ఓటు అనే పాశుపతాస్త్రంతో శాసించగలిగే హక్కును రాజ్యాంగం కల్పించింది కానీ ఇటీవల దిగజారిన విలువలు ఓటుకురేటు కల్పించాయన్న ఆవేదనవ్యక్తమవుతోంది. రాజకీయనాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం ఓటరుకు తాయిలాలు ఎరవేస్తూ, డబ్బులు కుమ్మరించి ప్రజాస్వామ్యానికి తూట్లుపొడుస్తున్నారు. కులం మతం వర్గం భాషలకతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సమసమాజ స్థాపనకై మన హక్కుల సంరక్షణకై ఓటు వేద్దాం మన కర్తవ్యం నెరవేరుద్దాం. పాకెట్ సారాకు, కానుకలకు ఆశ పడకుండా నూరేళ్ళ జీవితానికి, మన భావి తరాల వారి అభివృద్దికై ఓటు వేయండి. భారతప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయండి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఒక ఆయుధం దానిని సక్రమంగా ఉపయోగిద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. ప్రజలందరికీ జాతీయ ఓటరు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com