నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో మంచి నాయకుడు ఎన్నుకోవడం ఎన్నుకోవలసిన ఆవశ్యకతను ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ RTC వద్ద గల ఏనుగు సుందర రామిరెడ్డి కళ్యాణమండపం రోటరీ క్లబ్ రూమ్ నందు ఓట్ ఫర్ రైట్ లీడర్ అనే అంశంపై జనసేన పార్టీ తరపున యువసేన మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓటు హక్కు కలిగిన వందలాది మంది యువత పాల్గొని మరి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నాకు వందమంది బుద్ది బలశాలురైన యువకులను ఇవ్వండి. మీకు సుందర మహోన్నతమైన, పటిష్టమైన సమసమాజ రాజ్యాన్ని మీకిస్తాను ” , వివేకానందుడు ఆశించిన సమసమాజం కొరకు… అని ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన వివేకానందు ని ఆదర్శం తో యువత సాగాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఒకవేళ ఇప్పటికీ ఓటు నమోదు చేయించుకోకపోతే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ… మీ ఓటు తో సమాజాన్ని ప్రభావితం మంచి నాయకున్ని ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి పాటుపడవచ్చు అని తెలిపారు. అడ్డగోలుగా రాష్ట్రం విభజింపబడింది,ఉపాధి కోసం యువత రాష్ట్రాలు,దేశాలు దాటి పోవాల్సి వస్తుంది. ఏ కంపెనీ కూడా రాష్ట్రం వైపు చూసే పరిస్థితి లేదు. నా ఒక్క ఓటు తోనే సమాజం మారిపోతుందా అనే దిశగా కాకుండా నా ఓటుతో సమాజం మారుతుంది అనే దిశగా మీరు ఆలోచించాలని కోరారు. సరైన ప్రణాళికలు లేక అభివృద్ధి కుంటుపడింది, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేకపోతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నారు. వ్యాపారస్తుల తోపాటు అనేక రంగాలకు చెందిన వారు నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. పెట్రోల్ డీజిల్ ఇతర రాష్ట్రాల కంటే మన దగ్గర రేట్లు ఎక్కువగా ఉండే పరిస్థితి,మంచినీరు,వైద్యం,రోడ్లు వంటి కనీసం మౌలిక వసతులు కూడా అనేక ప్రాంతాల్లో అందే పరిస్థితి లేదు. దీనికంతటికీ రాజ్యాదికారం కొన్ని కుటుంబాలకి అంకితం అవడం.ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు కచ్చితంగా దానిని ఒకసారి ప్రయత్నించి చూడాల్సిన పరిస్థితి ఉంది. కుటుంబ పాలన అంతమొందించండి. ప్రజలను అడ్డం పెట్టుకొని కోట్లు సొంతగా సంపాదించుకునే నాయకులను గాక సొంత సంపాదన నుంచి ప్రజలకు ప్రజల సంక్షేమానికి డబ్బు ఖర్చు పెట్టే ఖర్చు పెడుతున్న నాయకుల్ని ఎన్నుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించి సమాజ శ్రేయస్సు పాటుపడే పవన్ కళ్యాణ్ గారి లాంటి వారికి అవకాశం ఇవ్వండని మీ చుట్టూ ఉన్నవారికి తరపున తెలపండి. అధికారం లేకపోయినా సొంత నిధుల నుంచి ఎంతోమందికి ఆర్థికంగా సహాయం చేసి సమస్య అంటే ముందుకు వచ్చే గొప్ప దేశభక్తి కలిగిన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి అవకాశం ఇవ్వండి. కలలు కను ,కలలు కనులు వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాల్లని ఖండించే వరకు కలలు కను… ఒక దేశ సంపద నదులు కాదు ఖనిజాలు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాల తో చేసిన ఈ యువత.దేశ భవిష్యత్తు కి నావికులు యువత …అన్న గుంటూరు శేషేంద్ర శర్మ…అంటూ యువత నుద్థేశించి మహనుభావుల సూక్తులతో ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పూసల మల్లేశ్వర రావు, ప్రశాంత్ గౌడ్, వెకట్, శివ, కంథర్, అమీన్, అలేక్, షాజహాన్, ఇంతియాజ్, రాజా, సుబ్బు, కృష్ణవేణి, సుజాత, రాధిక మరియు జనసేన యువత పాల్గొనడం జరిగింది.