Logo
Date of Publish : 20 September 2022, 5:07 pm
Editor : Sake Naresh

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే జనసేనకు ఓటు వేయండి : నలిశెట్టి శ్రీధర్

     ఆత్మకూరు ( జనస్వరం ) : జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఈరోజు 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరములు అయినప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతి దాదాపు శూన్యమే అని, ఆత్మకూరు సమీపంలోని నారంపేట పారిశ్రామిక వాడలో ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేసిన సెంచరీ ప్లైవుడ్ కర్మాగారము ముఖ్యమంత్రి సొంత జిల్లాకి తరలించడం ఎంతో శోచనీయమన్నారు. ఈ కర్మాగారం ఏర్పడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశపడిన ఈ ప్రాంత యువతకు ఇది శరాఘాతం అన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆత్మకూరు పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి వేలకోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పవనన్న ప్రజా బాట సందర్భంగా స్థానిక ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇవ్వడం జరిగింది. జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆత్మకూరు మున్సిపాలిటీలో ఆహ్లాదకరమైన పార్కులు నిర్మిస్తామని, నిర్మాణం మధ్యలో ఆగిపోయిన మినీ స్టేడియంను వెంటనే పూర్తి చేస్తామని, సకల సౌకర్యాలతో ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర, ధనుష్, సుధాకర్, పవన్, మస్తాన్ వలి, దినేష్ ,శ్రీహరి, అనిల్, భాను, శీను, రాజేష్, నాగేంద్రబాబు, శ్రీకాంత్, ప్రవీణ్, హజరత్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com