Logo
Date of Publish : 09 November 2022, 2:59 pm
Editor : Sake Naresh

ఎంప్లాయిమెంట్ సర్వే ముసుగులో ఓటర్ల వివరాలు సేకరిస్తున్న వాలంటీర్లు : దారం అనిత

          చిత్తూరు ( జనస్వరం ) : ఎంప్లాయిమెంట్ సర్వే ముసుగులో వాలంటీర్లు ఓటర్ల వివరాలు అడుగుతున్నారని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడుతూ ఎంప్లాయిమెంట్ సర్వే ముసుగులో గ్రామ వార్డు వాలంటీర్లు కొన్ని రోజులగా ఇంటింటికి వెళ్లి అడుగుతున్నారని అన్నారు.  పట్టబద్రులు మీ ఇంట్లో ఉన్నారా ? వాళ్ళు ఏం చేస్తున్నారు పట్టబద్రుల ఓటర్ల జాబితాలో వారు పేరు నమోదు చేసుకున్నారా ? ఏ రాజకీయ పార్టీ పైన ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ వివరాలన్నీ వాలంటీర్లు తెలుసుకోవలసిన అవసరం వారికి ఏంటి? నిజంగా ఎంప్లాయిమెంట్ సర్వేనైతే పట్టభద్రుల రాజకీయ ఆసక్తిల గురించి ఎందుకు అడుగుతున్నారు. ఇది ఎన్నికల విధుల్లో వాలంటీర్లు భాగస్వామ్యం కాదా ఇంత జరుగుతున్న ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదు. రాజకీయ పార్టీల నుండి ఫిర్యాదులు అందినప్పుడల్లా వాలంటీర్లకు ఓటర్ నమోదు సహా ఏ విధమైన ఎన్నికల పనులను అప్పగించొద్దు అంటూ ఆదేశాలు ఇవ్వడం తప్ప వాటి అమలుకు ఎందుకు పట్టించుకోవట్లేదు. వాటిని బేఖాతరు చేస్తున్న వాలంటీర్లను విధులనుండి ఎందుకు తొలగించడం లేదు. వారికి బాధ్యతలు అప్పగిస్తున్న అధికారులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఓటర్లుగా నమోదు చేయించాలి. శాసనమండలిలో ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియ సాగుతోంది గ్రామ వార్డు వాలంటీర్లు కొన్ని రోజులగా పట్టుబద్రుల వివరాలు సేకరించడం వారి పేరుతో ఓటర్ నమోదు కోసం దరఖాస్తు నింపటం దరఖాస్తులన్నీ సేకరించి సంబంధిత అధికారులకు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. వైకాపాకు అనుకూలమైన పేర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చి ప్రతిపక్ష పార్టీలకు మధ్య మద్దతు ఇచ్చే వారి పేర్లు చేర్చకుండా చూసేందుకే వాలంటీర్లను వినియోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంప్లాయిమెంట్ సర్వే పేరుతో వాలంటీర్లు నిర్వహిస్తున్న సర్వే ఎన్నికలను ప్రభావితం చేయటమే అవుతుంది. కావున ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com