Search
Close this search box.
Search
Close this search box.

వాలంటీర్ల వ్యవస్థ – జనసేన గళం

Volunteer

             ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు నదులు కాదు, అరణ్యాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత వారే మన భవిష్యతుకు నావికులు అని శ్రీశ్రీ గారు చెప్పిన మాటలను బట్టి ఒక దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఏంటో సుస్పష్టంగా అర్థమవుతుంది.. యువత వారి శక్తియుక్తులను ఉపయోగించుకొని, వారిలోని నైపుణ్యాలతో, నూతన ఆవిష్కరణలు చేస్తూ దేశాన్ని ప్రగతి బాటలో తీసుకువెళ్లాలి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పథకాలు రూపకల్పన చేసి వారికి అర్హతకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే 2019 జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను రూపొందించింది. 90% మనవాళ్లు ఉన్నారంటూ కార్యకర్తలను వాలంటీర్లులుగా నియమించుకొని గ్రామంలో ఉండే ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ అంటూ రాష్ట్రంలో సుమారు 2,50,000 మందిని (ప్రస్తుతం) నియమించి నెలకు గౌరవ వేతనం ₹5,000 అంటే రోజుకు ₹164.332 ఇస్తుంది. వాలంటీర్ వ్యవస్థ వల్ల సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు అని చెప్పిన ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు సేకరిస్తుంది? – అలా సేకరించిన వ్యక్తిగత సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “గారు చెప్పినట్లు హైదరాబాద్ లోని VOA ప్రైవేట్ కంపెనీకి డేటా ఎలా?? ఎందుకు ?? చేరుతుంది. కొంత మంది వాలంటీర్లుగా చెలామణి అవుతూ వైసిపి నాయకులు ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి ఆధార్, పాన్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ ను సేకరించాల్సిన అవసరం “ఏమిటి? ప్రభుత్వ శాఖల మధ్య, ప్రజల మధ్య అనుసంధానంగా ఉండటానికి గోప్యత పాటించవలసిన డేటాను ఎందుకు సేకరిస్తున్నారు ??? రాష్ట్రంలో NCB( నేషనల్ క్రైమ్ బ్యూరో ) వర్గాల సమాచారం మేరకు అదృశ్యమైన 30 వేల మంది పైగా మహిళలు రాష్ట్రంలో ఎలా అదృశ్యమయ్యారు? ? వారిలో 14,000 ఆచూకీ తెలిస్తే మిగిలిన 17000 మంది మహిళలు ఏమయ్యారు? ? వారి ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటువంటి చర్యలు చేపట్టింది ..

          మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం అంటున్న వైసిపీ ప్రభుత్వం. మాటలు వెనుక లక్షలాది మంది యువత తాము చదువుకున్న చదువుకు అర్హత కలిగిన ఉద్యోగం చేయలేకపోతున్నారు అన్న పచ్చి నిజాన్ని అంగీకరించ లేకపోవడం అనేది యువత పట్ల వారికున్న నిర్లక్ష్య వైఖరి, అవగతమవుతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వ విధానాన్ని ప్రశ్నించిన జనసేనానిపై మూడు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత దాడులకు దిగడం చూస్తుంటే వాళ్ల అజ్ఞాన వైఖరి ప్రస్పుటంగ తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాలలో యువత భవిష్యత్తు గురించి సరైన విధానాలు రూపొందించలేని జగన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోని వచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని వైసిపి ప్రభుత్వం విధానం చూస్తుంటే యువత పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందో అర్థమవుతుంది. చట్టబద్ధత లేని వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్లు సేకరిస్తున్న డేటాను వాళ్లకు తెలియకుండానే సంఘవిద్రోహక శక్తులకు అప్పగిస్తూ ఎంతో మంది యువత భవిష్యత్తును ప్రశార్థకంగా మారుస్తుంది.
               మన గంప కింద కూడు మనకి అందుతుంది కదా అన్న చందాన ఆలోచించకుండా తన సామర్థ్యాలకు, అర్హతకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించలేకపోతున్నా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిగ్గదీసి ప్రశ్నించాలి. సంక్షేమం పేరుతో ఉచితాలకు ఆశపడి ఓటు వేయకుండా నేటి యువతరం కూడా రాజకీయాల పట్ల, వ్యవస్థల పట్ల అవగాహన ఏర్పరచుకొని దానికి అనుగుణంగా సంక్షేమం పేరుతో ఎన్ని అప్పులు చేస్తుందో, రాష్ట్రం ఎలా అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. దానివల్ల భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక ఖజానా పరిస్థితి, రాష్ట్ర ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉండబోతుందో ప్రజలకు అవగాహన కల్పించి ఓటు అనే ఆయుధంతో మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలన్నా సంకల్పంతో, అవినీతి నిర్మూలన ధ్యేయంగా, సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా సైనికుడిలా పోరాట స్ఫూర్తిని నింపుకొని ముందుకు అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ నిర్మాణానికి, నవ యువ శకానికి ఆహ్వానం పలుకుదాం. 

– జ్యోతి 

ట్విట్టర్ ( Jyothi6535 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20240403-WA0002
ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి : జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత
IMG-20240331-WA0016
జనసేన పార్టీలోకి కొనసాగుతున్న వలసలు
IMG-20240319-WA0007
అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
IMG-20240318-WA0009
ఉమ్మడి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్
IMG-20240315-WA0303
జనసేన నాయకులు వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way