విజయనగరం ( జనస్వరం ) : జిల్లాలో 9 నియోజకవర్గల పరిధిలో గల 24 మంది మండల అధ్యక్షులు ఆత్మీయ సమావేశం చీపురుపల్లి నియోజకవర్గం పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో మండల అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, మండల అధ్యక్షుల వారి వారి పరిధిలో గల సమస్యలను వాళ్లు ఎదుర్కొంటున్న రాజకీయ ఒడిదుడుకుల గురించి, మండల అధ్యక్షుల సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న విషయం గురించి చర్చించారు. జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్చార్జిల్ని పార్టీ నియమిస్తే బాగుండునే అభిప్రాయాన్ని అదేవిధంగా, మిగిలిన మండల అధ్యక్షులు కూడా బాగుంటుందని మండల అధ్యక్షులు అందరూ కూడా ఏక అభిప్రాయంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో మండల పరిధిలో ఏ కార్యక్రమం జరిగిన అందరూ కూడా మండల అధ్యక్షులు ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకోవాలని అన్నారు. మండలంలో ఏ కార్యక్రమం జరిగినా మండల అధ్యక్షుడుకి ముందుగా సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యక్రమాల్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మండల అధ్యక్షులు అందరూ కూడా కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కమిటీని అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఆమోదించడం జరిగింది. అధ్యక్షునిగా చీపురుపల్లి మండల అధ్యక్షులు విసనగిరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కొత్యడ లోకాభి (రామకోటి), పతివాడ కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శిగా మరడాన రవి,రౌతు కృష్ణవేణి, కార్యక్రమాల కమిటీ సభ్యునిగా మునకల జగన్నాథరావు గారిని కమిటీగా ఎన్నుకోవడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com