Search
Close this search box.
Search
Close this search box.

విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

విజయనగరం

    విజయనగరం ( జనస్వరం ) : మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటులు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవాసంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు,జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అన్నిదాణాల్లో కన్నా రక్తదానం మహాగొప్ప దానమని, ప్రేమే లక్ష్యం, సేవేమార్గం అనే సిద్ధాంతాన్ని అలవర్చుకున్న, సేవకు ప్రతిరూపమైన మెగాస్టార్ చిరంజీవి బాటలోనే మెగాభిమానులు ఇటువంటి రక్తదాన, నేత్రధానం వంటి పలుసేవలు చేయటం సమాజానికి ఎంతోమందికి ఆదర్శమని అన్నారు. అనంతరం చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ ఆగష్టు 16నుండి 22వరకు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వారోత్సవాల్లో మొక్కలు నాటడం,అన్నదానం,సర్వమత ప్రార్థనలు,వైద్య శిబిరాలు నిర్వహించామని,చిరంజీవి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యమని అన్నారు. పలువురు రక్తదానం చేసిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, దంతులూరి రామచంద్ర రాజు, సీనియర్ మెగాభిమాని,గొప్ప రక్తదాత కె.కృష్ణారావు, జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన యువనాయకలు లాలిశెట్టి రవితేజ, హుస్సేన్ ఖాన్, ముదిలి శ్రీనివాసరావు,రఘు,బాబు, కందివలస సురేష్,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way