అనంతపురం ( జనస్వరం ) : భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు. సమాజ తలరాతన మార్చే అలాంటి ఓటును నిజాయితీ నిబద్ధత కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం.. జనసేనను గెలిపిద్దాం అని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సప్తగిరి సర్కిల్ లోని పార్టీ కార్యాలయంలో నగర, జిల్లా, అభిమానుల కమిటీ సమావేశంలో టి.సి.వరుణ్ గారు మాట్లాడుతూ యువతతో పాటు వివిధ రంగాల ప్రజల్లో జనసేన పార్టీ పట్ల ఉన్న సానుకూల వైఖరిని ఓటుగా మార్చే బాధ్యతను ప్రతి ఒక్క జనసైనికుడు తీసుకోవాలన్నారు. వారి పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులను ఓటర్లుగా చేర్పించే క్యాంపెయిన్ ను విస్తృతంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జనసేన పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా మనమందరం ఐక్యమత్యంతో ముందుకెళ్దాం అన్నారు. మొదటి ఓటు జనసేనకే అన్న నినాదంతో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని టి.సి.వరుణ్ గారు నగర, జిల్లా నాయకులకు, జనసైనికులకు మరియు వీరమహిళలకు, కార్యవర్గ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా, నగర కమిటీ సభ్యులు, నాయకులు, జనసైనికులు వీరమహిళలు, అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com