పిఠాపురం ( జనస్వరం ) : టౌన్ 15వార్డు లో దీనస్థితిలో ఉన్న ముస్లిం మైనార్టీ అక్క చెల్లెమ్మలు ఉన్నారని అన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారి సూచనల మేరకు, పిఠాపురం టౌన్ లో జనసేన పర్యటన లో భాగంగా పిఠాపురం ముస్లిం సోదరుడు MD గారి ఆధ్వర్యంలో పర్యటించారు. పిఠాపురం మోహన్ నగర్ వాసులు 3 సంవత్సరాలుగా మురికి నీటిలో ముస్లిం మైనార్టీ సోదరులు జీవిస్తున్నారని అన్నారు. పిఠాపురం పట్నం 15వ వార్డు మోహన్ నగర్ లో దీనస్థితిలో ఉన్న ముస్లిం సోదరులు ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు, పి.ఎస్.ఎన్ మూర్తి టీం పర్యటించడం జరిగింది. అక్కడ వాళ్ళు ఉన్న స్థితిని చూసి ఆశ్చర్యం కలిగిందని అన్నారు. ఇంకా పిఠాపురం పట్నంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చాలా ఆశ్చర్యం కనిపించిందని అన్నారు. వెంటనే వారికి సాయంగా బియ్యం, కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ ముస్లిం సోదరులతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి మీకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.డి, పిండి శ్రీను, కర్రీ కాశీ, టైల్స్ బాబీ, యండ్రపు శ్రీనివాస్, పబ్బిరెడ్డి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్ , పెంకే జగదీష్, మరియు పి.ఎస్.ఎన్. మూర్తి, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com