చీపురుపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావ గారు ఈ రోజు గరివిడి మండలలో అంగన్వాడి ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నాలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోని అంగన్వాడి ఉద్యోగస్తులు చేస్తున్న సేవ ఎంతో మరువలేనిది, చిన్నపిల్లలు అందరికీ ఒక తల్లి లాగా, ఒక గురువు లాగా, చిన్నపిల్లలందరినీ ఎంతో చక్కగా తీర్చిదిద్దడం ఎంతో ముఖ్యమైన పాత్ర వాళ్లది. గ్రామంలో ఉన్న గర్భ స్త్రీలను దగ్గరుండి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి తీసుకురావడం వారిని ఒక తల్లిలాగా చూసుకుంటూ అలాంటి అంగన్వాడి ఉద్యోగస్తు ఈ వైసీపీ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. తక్షణమే అంగన్వాడి ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించండి, వాళ్లని ప్రభుత్వం ఉద్యోగస్తులుగా గుర్తించండి. లేదా అంగన్వాడి ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నా,మీ వైసీపీ ప్రభుత్వాన్ని కూలతీస్తారు. మరో రెండు నెలలు మాత్రమే ఉన్నాయి. అంగన్వాడీ ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నాకు జనసేన టీడీపీ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం సీనియర్ జనసేన నాయకులు సిగ తవిటి నాయుడు, సింహాచలం మరియు జనసేన వీరమహిళ జమ్ము జ్యోతి పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com