విశాఖపట్నం, (జనస్వరం) : HPCL ఎక్స్టెన్షన్ లో భాగంగా పెద్ద పెద్ద పరికరాలు కంపెనీలోకి రావాల్సి ఉందని దాని వలన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ నుంచి మల్కాపురం మెయిన్ రోడ్ మీద ఉన్న డివైడర్ నీ తొలగిస్తున్నారు. డివైడర్ తొలగించిన తరువాత ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికంగా ఉంది. కాబట్టి డివైడర్ ను తొలగించుటకు మేము ప్రజల ప్రాణాల దృష్ట్యా వ్యతిరేకిస్తున్నాము. కానీ డివైడర్ తొలగించే పరిస్థితి తప్పనిసరి కాబట్టి పారిశ్రామిక ప్రజలకు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని జనసేన పార్టీ తరపున బలంగా డిమాండ్ చేస్తున్నాము. అవి ఏమనగా
1. డివైడర్ ను తొలగించిన వెంటనే తాత్కాలిక డివైడర్ ను ఏర్పాటు చెయ్యాలి. అదే విధంగా రేడియం స్టికర్స్ అమర్చి రాత్రి పూట ప్రమాదాలు జరగకుండా కాపాడాలి. ఈ ప్రాంతంలో ప్రయాణించు వాహనదారులకు ఎలాంటి ప్రమాదాలు జరిగిన దానికి పూర్తి బాధ్యత HPCL కంపెనీ వహించాలి అని జనసేన పార్టీ తరపున బలంగా డిమాండ్ చేస్తున్నాము.
2. డివైడర్ తొలగించిన తరువాత దుమ్ము ధూళి విపరీతంగా పెరుగుతుంది. కావున GVMC నుంచి అధికంగా మాన్ పవర్ ను పెట్టీ ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యాలి. లేని పరిస్థితిలో రోడ్ వారు షాపులు, ఇళ్ళు దారుణంగా తయారవుతాయి.
పై రెండు డిమాండ్ లను లిఖితపూర్వకంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయునచో మేము స్వాగతిస్తాము లేని పక్షంలో మేము నిలువరిస్తామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com