నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన విశాఖ జనసైనికులు
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి జన్మదినం పురస్కరించుకుని, నేటి రోజులలో ఎంతో ఆవశ్యకతను కలిగి ఉన్న రక్త దానం కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు శ్రీ బాల రాజేశ్వరరావు (VSP – బీజేపీ ఉపాధ్యక్షులు) గారి ఆధ్వర్యంలో ” రక్త దానం కార్యక్రమం” విశాఖపట్నంలోని 89వ వార్డ్ లో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా ఎం.రవీంద్ర గారు(బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు) పాల్గొన్నారు. జనసైనికులు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ చేసిన చెత్త ని శుద్ధి చేస్తూ స్వచ్ఛ భారత్ వైపు ప్రతి పోరుడిని నడిపిస్తూ దేశం పట్ల విధేయులుగా తీర్చిదిద్దుతున్నా నరేంద్రమోడీ గారికి మా కృతజ్ఞతలు. రాజ్యం రాక్షసులు చేతులు పడ్డాకే మనకి రాముడు గుర్తొస్తాడు. అలాంటి రాముడు జన్మస్థలం అయిన అయోధ్యను పరులు పాలు కాకుండా సనాతన ధర్మాన్ని కాపాడుతున్న భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని దేశం లో మరెందరో మోడీ లు గా తయారవ్వలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో 89 వ వార్డు జనసైనికులు హర్ష, సాయి, అప్పలరాజు, ఖాన్, కార్యక్రమంలో పాల్గొన్నారు.