విశాఖపట్నం, (జనస్వరం) : పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డా.సుంకర వెంకట ఆదినారాయణరావు గారిని విశాఖలో జనసేన పక్షాన సత్కరించారు. జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యులు శ్రీ కోన తాతారావు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సుందరపు విజయ్ కుమార్, ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి పి.ఉషాకిరణ్, జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల, 22వార్డ్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పాల్గొన్నారు. భీమిలీ ఇంచార్జ్ డా" సందీప్ పంచకర్ల మాట్లాడుతూ పోలియో వ్యాధిగ్రస్తుల పాలిట దైవంగా పేరుపొందిన ఆయన తన వైద్య సేవల ద్వారా దేశ విదేశాల్లో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. విశాఖలో ప్రీ పోలియో సర్జికల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ గా, ప్రేమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్ జనరల్ గా సేవలదిస్తున్నారు అని తెలియజేసారు. అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డా" ఆదినారాయణ అంటే ప్రత్యేక అభిమానం అని ఆయన చేసిన సేవలు అన్న పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టం అని అన్నారు. గతంలో విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా డా" ఆదినారాయణ ఇంటికి వెళ్లి ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఆదినారాయణ లాంటి మహోన్నతమైన వ్యక్తికి పద్మ శ్రీ అవార్డ్ రావడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని సందీప్ పంచకర్ల అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com