జనసేన పార్టీ ఓ కుటుంబం లాంటిది. అందులో ఏ ఒకరికి కష్టం వచ్చినా మిగిలిన కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారని విశాఖ జనసేన నాయకులు గోపాలకృష్ణ గారు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జనసైనికుడు నారుకుల సతీష్ గారికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రెండు కాళ్ళు మరియు కుడిచేయి కోల్పోయి విశాఖపట్నంలోని KGH ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ విషయం జనసైనికుల ద్వారా తెలుసుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపాలకృష్ణ గారు గారు రూ. 5000 ఆర్థిక సాయం అందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, జనసైనికులు అండగా ఉంటున్నారని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన జనసేవ కార్యక్రమం స్ఫూర్తితో సహాయం అందించానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com