విశాఖ ద్రోహి విజయసాయిరెడ్డి
విశాఖపట్నం ( జనస్వరం ) : ఆదరిస్తే అభిమానిస్తాం, అనగదొక్కితే తిరగబడతాం అని పర్యావరణవేత్త జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనం లేదు ప్రజలకు సంబంధించింది. విశాఖ పౌర హక్కుల గురించి మాట్లాడే వారు నేతలే కరువయ్యారని, నెల్లూరు వాసి విజయసాయిరెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేయాలని కేంద్రానికి ఎందుకు లెటర్ రాశారు. ప్రభుత్వం ఏదైనా ఉంటే మూసి వేయవద్దు అని అడుగుదాం కానీ విచిత్రంగా మూసి వేయమని అడగడం, అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు ఫేజ్ ఫోర్ లో అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి చెందుతున్న ఎయిర్పోర్టును స్వయంగా రాయలసీమ విజయసాయిరెడ్డి ఆపివేయమని లెటర్ రాయడం దారుణమని, అలాగే శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ కావాలి, విజయనగరం ఏర్పాటు కావాలన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శంకర్రావు గారు మాట్లాడుతూ ఏ నినాదం వెనుక ఏ వ్యక్తి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని, ఈ నాయకులు మోసగిస్తూనే ఉంటారు అని నినాదం కామ్రేడ్ లెనిన్ గారు మాటలు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయి. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిన వెంటనే 30 సంవత్సరాలు విశాఖ ఎయిర్ పోర్టు మూసివేయాలని చెప్పేసి అక్కడ పనులు ప్రారంభించక ముందే విజయసాయి రెడ్డి లెటర్ రాశారంటే ఎవరిని ఎవరిని సంప్రదించి రాశారు ప్రస్తుతం రాయవలసిన అవసరం ఏముంది? ఈ లెటర్ రాయడం వెనుక ప్రజా ప్రయోజనం ఏమైనా ఉందా? అసలు విశాఖపట్నం నైసర్గిక స్వరూపం పై మీకు అవగాహన ఉందా, విశాఖపట్నం ఎయిర్ కార్గోకి అనుకూలంగా ఉంటుంది. 60 లక్షలకు పైగా ప్రయాణికులు భవిష్యత్తులో పెరుగుతారని ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ అంచనాలో ఉంది. ఈ విషయాలు మీకు ఏమైనా అవగాహన ఉందా ?మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే విశాఖ వాసులు మీకు తీవ్రమైన గుణపాఠం చెబుతారు నెల్లూరులో చేయవలసింది మీరు విశాఖ మీద గుదిబండలా వచ్చి విశాఖపట్నం వాసులకు ద్రోహం చేయాలంటే జనసేన పార్టీ ఊరుకోదు. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడంసంతోషం ఇంకా ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతామని చెప్పారు కదా కట్టండి కానీ, భోగాపురం ఎయిర్ పోర్ట్ కడుతున్నామని విశాఖ ఎయిర్పోర్ట్ మూసి వేయడం అనేది చాలా దురదృష్టకరమైనది, చాలా బాధాకరమైనది. ఇందులో మీ ప్రయోజనాలు ఏమి దాగున్నాయి? మీ వ్యాపార ప్రయోజనాలు ఏమి దాగున్నాయి? ఇవన్నీ విషయాలు విశాఖపట్నం ప్రజలకు తెలియవలసిన విషయం ఉంది విజయసాయిరెడ్డి గారు… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చిన్న బూచి చూపించి విశాఖపట్నానికి నష్టం చేకూర్చే విధంగా ఉంటే పోరాటం తప్పదు అని అన్నారు.