రామచంద్రపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం రూరల్ కాపవరం గ్రామంలో ఆరు సంవత్సరాల చిన్నారి బాలికపై జరిగిన హత్యాచారం ఘటనపై రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్ లో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదనంతరం రామచంద్రపురం పట్టణములో RDO గారికి వినతి పత్రం అందజేస్తూ చిన్నారి బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు చింతిస్తూ జనసేన పార్టీ తరఫున పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్ డి ఓ గారికి అభ్యర్థన సమర్పించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో ప్రభుత్వం తరపు నుండి ఆర్థిక సహాయం 25 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా అందించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం యంత్రాంగం దృష్టి సాధించాలని శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లా వీర మహిళా విభాగం కోఆర్డినేటర్లు చల్లా లక్ష్మి, కడలి ఈశ్వరి, ముత్యాల జయలక్ష్మి, తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శులు బుంగా రాజు, సంపత్, డేగల సతీష్, కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతా బత్తుల విజయ్ కుమార్, గంగవరం మండలం అధ్యక్షులు చిర్రా రాజ్ కుమార్, పట్టణ 3 వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస రావు, జనసేన పార్టీ నియోజకవర్గ MPTC లు, సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, వీర మహిళలు దారపు శిరీష, పితాని కరుణ, రమణ కుమారి, సుబ్బలక్ష్మి, కనక రత్నం, వీర వేణి, జనసేన నాయకులు, నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.