Logo
Date of Publish : 05 September 2023, 8:15 pm
Editor : Sake Naresh

చిత్తూరు జిల్లాలో 12 మంది మహిళలు, ఆడ పిల్లల మిస్సింగ్ వార్తపై వినూతకోట స్పందన

   శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఉమ్మడి చిత్తూర జిల్లాలో 12 మంది మహిళలు, ఆడ పిల్లలు మిస్సింగ్ అని వచ్చిన వార్తలపై జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంత మంది మహిళలు మిస్స్ అవుతుంటే జిల్లాలో ఉన్న మంత్రి రోజా అస్సలు స్పందించలేదని? కనీసం ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చెయ్యలేదని, కనీసం ప్రెస్స్ మీట్ పెట్టీ సంఘటన గురించి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదని ద్వజమెత్తారు. గన్ను కంటే ముందు జగన్ వస్తాడని ప్రగల్బాలు పలికే ఈ మంత్రి ఎక్కడ నిద్ర పోతుందని వాపోయారు. మహిళా హోమ్ మంత్రి ఎక్కడ ఉన్నారని, ఇప్పుడు మహిళా కమిషన్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కనీసం జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, తిట్టడానికి మాత్రమే వైసీపీలో ఉన్న మహిళ నాయకులు మంత్రులు బయటకి వస్తారని, మహిళలు మిస్స్ అవుతున్న దానిపై ఎందుకు స్పందించరు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారిని మహిళ మిస్సింగ్ పై ప్రశ్నించిన తిరుపతి ఎస్పీ గారు ఇదే జిల్లా లో ఇంత మంది మహిళల మిస్సింగ్ పై ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. జిల్లాలో మంత్రి గా ఉన్న రోజా కనీసం ఇప్పటికైన కళ్ళు తెరిచి ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టాలని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు బుద్ధి చెప్తారని హితవు పలికారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com