శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తిలోని నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారిని పార్టీ కార్యాలయం లో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. అలాగే సంఘం నాయకులు చేస్తున్న త్యాగరాజ ఆరాధన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. నాయి బ్రాహ్మణులు చేస్తున్న త్యాగరాజ ఆరాధన కార్యక్రమం కు 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వినుత కోటా గారు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఈ సారి ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరుతూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాయి బ్రాహ్మణులకు పూర్తి స్థాయిలో ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. నాయి బ్రాహ్మణులలో చదువుకున్న యువత ఉద్యోగాలు లేక, ఒక పక్క కుల వృత్తి చెయ్యలేక ఇబ్బందులు పడుతున్నా విషయం బాధాకరమని, అధికారంలోకి రాగానే చదువుకున్న యువతకి ఉచితంగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.శ్రీకాళహస్తి నియోజకవర్గం
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com