శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఏర్పేడు మండలం, గ్రామానికి వెళ్ళే దారిని అక్రమంగా మూసివేసి LANCO/ECL ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులతో కలిసి శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న వారిని అక్రమంగా పోలీస్ లు అరెస్ట్ చేసి B.N. కండ్రిగ పోలీస్ స్టేషన్ కి తరలించడం అప్రజాస్వామికమన్నారు. మహిళలను సైతం గాయపరిచేల లాక్కెలడం హేయమైన చర్య. రోడ్డును మూసివేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెప్తుంటే, పోలీస్ లు ఫ్యాక్టరీ వారికి కొమ్ము కాస్తూ R&B రోడ్డు ను మూసివేసిన ఫ్యాక్టరీ వాళ్ళను ఏ మాత్రం ప్రశ్నించకుండా ప్రజలను అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం తీవ్ర అక్షేపనీయం అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీస్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాO. ప్రజల పోరాటాన్ని పోలీసులను అడ్డు పెట్టుకుని ఆపలేరని ఆమె హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com