శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఏర్పేడు మండలం, చిందే పల్లి గ్రామానికి నాయుడు పేట- పూతలపట్టు హైవే నుండి R&B కి చెందిన రోడ్డు గత 70 సం. గా ఉంది. ఈ రోడ్డు ను LANCO / ECL ఫ్యాక్టరీ వారు గ్రామస్థుల అనుమతి లేకుండా ఆ రోడ్డును మూసివేయడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి గ్రామం కి చేరుకుని సమస్యని పరిశీలించడం జరిగింది. కలెక్టరు ఉత్తర్వులు ఉన్నాయంటూ ఉన్న రోడ్డును మూసేసి , గ్రామస్థులకు ఎలాంటి సౌకర్యం లేని రోడ్డు ను చూపి ఆ రోడ్డులో వెళ్ళాలి అంటూ 200 మంది పోలీస్ లను ఉపయోగించి గ్రామస్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కాలువను ఆక్రమించి తాత్కాలికంగా గచ్చు రోడ్డును ఏర్పాటు చేసి అందులో వెళ్ళాలి అంటూ గ్రామస్తులను ఇబ్బందులు పెడుతున్నారు. రాత్రి పూట మహిళలు, రైతులు, విద్యార్థులు రోడ్డు మూత పడటం తో 2.5 కి.మీ నడిచి కటిక చీకటిలో వెళ్ళాలి వస్తుందని తెలియజేశారు. బస్సు ఎక్కడానికి వెళ్లాలన్నా 2.5 కి.మీ దూరం భారంగా ఉంటుందని ప్రజలు తెలిపారు. తప్పకుండా జన సేన పార్టీ గ్రామస్థులకు మద్దతు ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. వారితో కలిసి జనసేన పార్టీ పోరాడి వారి రోడ్డు వారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు నితీష్, బాలాజీ, భాను, సురేంద్ర, చెంచుముని, గిరీష్, జన సైనికులు పాల్గొన్నారు.