Logo
Date of Publish : 07 March 2023, 3:51 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన వినుతా కోటా

             శ్రీకాళహస్తి ( జనస్వరం ) : గోవిందరావు పల్లి పంచాయతీ లోని మాదిరిపల్లి గ్రామం మద్యలో ఉన్న పురాతన చింత చెట్టుకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో చెట్టు కుప్పకూలి ఇళ్ళపై పడడం వల్ల 3,4 ఇల్లు కూలిపోవడం జరిగింది. గ్రామస్థులు సమాచారం ఇచ్చిన వెంటనే శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వినుత కోటా గారు ఆ గ్రామానికి చేరుకుని యం.ఆర్.ఓ గారితో ఫోన్లో సమస్య తెలియజేసి రెవెన్యూ అధికారులను పంపి మంటలు ఆర్పించాలని, కూలిన చెట్టును తొలగించాలని కోరడం జరిగింది. స్పందించిన యం.ఆర్.ఓ గారు వెంటనే వి.ఆర్.ఓ ను పంపడం జరిగింది. విరిగిన చెట్టు కొమ్మలకు తొలగించడం కొరకు గ్రామస్థులకు వినుత గారు 5,000 ఆర్థిక సహాయం చేశారు. గ్రామంలోని స్కూల్ ఉన్నా కూడా మూతబడి ఉందని స్కూల్ లేక 30 మంది పిల్లలు 2 కి.మీ నడిచి వెళ్తున్నట్టు మహిళలు సమస్యను తెలిపారు. తప్పక కలెక్టర్ గారికి స్కూల్ సమస్య తెలిపి పరిష్కారం కొరకు జనసేన పోరాడుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు శ్రీనివాసులు, రవి కుమార్ రెడ్డి, జనసైనికులు బాలాజీ, శివ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com