Logo
Date of Publish : 20 March 2023, 3:59 pm
Editor : Sake Naresh

చిందేపల్లి గ్రామస్థులతో కలిసి ఆర్.డి.ఓ గారికి జనసేనపార్టీ తరుపున వినతి అందించిన వినుతా కోట

       శ్రీకాళహస్తి ( జనస్వరం ) :  చిందేపల్లి గ్రామానికి వెళ్తున్న ప్రధాన రహదారి పై LANCO/ ECL ఫ్యాక్టరీ వాళ్ళు అడ్డుగా గోడ కట్టడాన్ని నిరసిస్తూ రోడ్డు పై అక్రమంగా అడ్డు గోడ కట్టడాన్ని వెంటనే తొలగించాలని గ్రామస్థులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ G.O. 22/2016 ద్వారా R&B పరిధి లోకి తీసుకున్న రోడ్డు ను ఏ విధంగా మూసి వేస్తారని ప్రశ్నించారు. కాలువ పరుంబోకు లో ప్రత్యామ్నాయ రోడ్డు కల్పించమని G2/1295/2022 ద్వారా కలెక్టర్ గారు ఏవిధంగా ఉత్తర్వులు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలకి ఇబ్బంది కల్గించి ఫ్యాక్టరీ యాజమాన్యం వందల మంది పోలీస్ లను ఉపయోగించి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తక్షణమే రోడ్డు పై ఉన్న అడ్డు గోడను తొలగించాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని, చట్టపరంగా హై కోర్ట్ ను ఆశ్రయించి రెవెన్యూ అధికారులు , పోలీస్ అధికారుల పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డుకి అడ్డుగా గోడ కట్టమని ఎలాంటి ఉత్తర్వులు రెవెన్యూ అధికారుల నుండి ఫ్యాక్టరీ యాజమాన్యం కి ఇవ్వలేదని ఆర్.డి.ఓ. గారు తెలిపారు. సమస్య ను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి రోడ్డు పై అక్రమ గోడ ను తొలగిస్తామని హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com