శ్రీకాళహస్తి ( జనస్వరం ) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంకటగిరి సభలో జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చెయ్యడాన్ని ఖండిస్తూ ఈరోజు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వినుత కోటా గారు, నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ వైసీపీ పార్టీ సేకరిస్తున్న సమాచారం ఎక్కడికి వెళుతుంది? డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? ఈ వ్యవస్థకి అధిపతి ఎవరు? వారు తప్పు చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారు? వారి ద్వారా ప్రజలకి సంబంధించిన సెన్సిటివ్ డేటా కొంత మంది నేరగాళ్లకు వెళుతుంది రాష్ట్రంలో మహిళలకి ఇబ్బంది కలుగుతుంది అని మాట్లాడితే?? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేకనో ! సమాధానం లేకనో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి నిసిగ్గుగా మాట్లాడారని తెలిపారు. నువ్వు అంతా పారదర్శకంగా వాలంటీర్ వ్యవస్థను నడుపుతుంటే అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు, అంతే కానీ ఇలాంటి చిల్లర మాటలు ముఖ్యమంత్రి స్థాయిని దిగజరుస్తుందని తెలిపారు. మీ తండ్రి గారు చనిపోయిన రోజు కలకత్తా లో ఏ పరిస్థితిలో ఏ మీటింగులో ఉన్నారో మాకు తెలుసని? మీ బెంగళూర్ పాలస్ లో జరిగే రాసలీలలు గురించి కూడా మాకు తెలుసని? మీ కుటుంబంలో ఉన్న అక్రమ సంభంధాలు గురించి కూడా తెలుసని? మీ తాతల కాలంలో మీరు ఎన్నో భార్యకి సంతనమో కూడా మీ పులివెందుల ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలుసు అని మండి పడ్డారు. విధానాల పరంగా మాట్లాడకుండా, ఓటమి భయంతో చిల్లర మాటలు మాట్లాడడం తగదని ముఖ్యమంత్రి అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ ఇంత నీచానికి దిగజార కూడదని ఎద్దేవా చేశారు. మీ వ్యక్తిగత జీవితం గురించి కూడా జనసేన పార్టీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, మా సంస్కారం వాటిని బయట పెట్టకుండా అడ్డుపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి బెంగళూరు పాలస్ లో చేసిన చీకటి పనులు ఎక్కడ బయటకి వస్తుందని కర్ణాటక ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ నాయకుడికి వందల కోట్లు ఇవ్వడం నిజము కాదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు ద్వారా ప్రజలకి ఎంత నష్టం జరుగుతుందో తెలపడంతో వీళ్ళ గుట్టు రట్టయింది జీర్నించలేక ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగిస్తే ధీటుగా మీ చీకటి పనులు బయట పెడతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ ,శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి , ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివ కుమార్ , నాయకులు ముని కుమార్, గణేష్ , మాధవ మహేష్, నితీష్ కుమార్, వెంకటరమణ, చిరంజీవి , కృష్ణ కోనేటి తదితరులు పాల్గొన్నారు.