శ్రీకాళహస్తి ( జనస్వరం ) : క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు తొట్టంబేడు మండలం , తొట్టంబేడు పంచాయతీ లోని చిలకావారి కండ్రిగ లో జనసైనికులతో కలిసి ఇంటింటికీ పర్యటించి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది, అలానే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. గ్రామంలో ఎక్కువ మంది యువత జనసేన క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్నారు.
ప్రధానంగా గ్రామంలోని మహిళలు జనసేన కు తెలిపిన సమస్యలు
1. ఆరు నెలలు గడుస్తున్న డ్రైనేజీ కాలువలు శుభ్రం చెయ్యకుండా గ్రామ మొత్తం డ్రైనేజీ కాలువలు చెత్త, ప్లాస్టిక్ తో నిండి దుర్వాసనతో దోమలు, ఇతర కీటకాల వలన రోగాల బారిన పడుతున్నట్టు తెలిపారు. ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు.
2. గ్రామం లోని ఓవర్ హెడ్ ట్యాంకు సంవత్సరాలు గడుస్తున్నా అస్సలు శుభ్రం చెయ్యలేదని తెలిపారు.
3. స్ట్రీట్ లైట్లు పని చెయ్యడం లేదని తెలిపారు.
4. రోజూ వారి కార్మికులు పనులు లేక, ఆకాశాన్ని అంటిన నిత్యావసర ధరలు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.
గ్రామంలో సమస్యలను అక్కడి నుండే ఎంపీడీవో గారికి ఫోన్ లో వినుత గారు తెలపడం జరిగింది. ఎంపీడీవో గారు తక్షణమే అధికారులను పంపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, జనసైనికులు విజయ్ భాస్కర్ ,ప్రకాష్, సుబ్బు, సుబ్రమణ్యం, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.