
విజయవాడ, (జనస్వరం) : చిన్నారి పై జరిగిన లైంగిక దాడులను వ్యతిరేకిస్తూ వినోద్ జైన్ అనే మానవ మృగన్ని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని 38,39,44,45 డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్, శరత్ సాయి ఏలూరు, మల్లేపు విజయం లక్ష్మి, బొమ్ము రాంబాబు గార్ల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన కుమ్మరిపాలెం లోటస్ అపార్ట్మెంట్స్ నుండి నాలుగు స్తంభాల సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతిన వెంకట మహేష్ పాల్గొనడం జరిగింది. మహేష్ మాట్లాడుతూ పార్టీ ఏదైనా సరే నిందితుడిని శిక్షించాలని అలాగే దిశ చట్టం ఉండగా ఫోక్స్ చట్టంలో కేసు బుక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వన్ని గట్టిగా నిలదీశారు. అనంతరం అంబేద్కర్ గారి విగ్రహానికి డివిజన్ అధ్యక్షులు పూలమాలవేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కమిటీ నాయకులు, ధార్మిక సేవ మండలి సభ్యులు, డివిజన్ కమిటీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.