నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 107వ రోజున 13వ డివిజన్ బాలాజీనగర్, బ్యాంకు కాలనీ 2వ వీధిలో జరిగింది. వినాయకచవితి పండుగ రోజున తమ ప్రాంతంలో ఇంటింటికీ వస్తున్న కేతంరెడ్డిని పలువురు సాదరంగా తమ ఇళ్ళలోకి ఆహ్వానించి తమ ఇంట్లో చేసుకున్న ప్రసాదాలను ఆప్యాయంగా అందించారు. ప్రజలతో కలిసి ప్రజల మధ్యనే వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ వినాయకచవితి పండుగ సందర్భంగా మనకు ఏర్పడిన విఘ్నాలన్నీ తొలగి ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com