విశాఖపట్నం జిల్లా, గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు, గంగవరం నాలుగు గ్రామాల పరిసరాల్లో చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ముఖ్యంగా గంగవరం పోర్టు నుండి వస్తున్న పొల్యూషన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పోర్టు యాజమాన్యంకి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకి ఎన్నిసార్లు ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తున్న కాలుష్యాన్ని నివారించడం లేదు 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు గారిని కలిసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరగా తక్షణమే స్పందించిన ఆయన న్యాయపరంగా పోరాడుతామని చెప్పారు. నోటి మాట కాకుండా పేపరు మాటే సమాధానంగా చెప్పాలని హైదరాబాద్ నుండి ఒక టీమును రప్పించి డస్ట్ శాంపిల్ మిషన్ గంగవరం గ్రామంలో పెట్టించడం జరిగింది. శాంపిల్స్ రిజల్ట్ చెక్ చేయగా గంగవరం గ్రామం కాలుష్య కోరల్లో చిక్కి ప్రజలు తీవ్రమైన అతి ప్రమాదకరమైన రోగాల బారిన పడతారని చెప్పడం జరిగింది. తక్షణమే పొల్యూషన్ బోర్డు వారిని సంప్రదించి కాలుష్యాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ దల్లి గోవిందరాజు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన విశాఖ పార్లమెంట్ మాజీ అధికార ప్రతినిధి చొడిపిల్లి ముసలయ్య గారు, విశాఖ జిల్లా జనసేన పార్టీ సోషల్ జస్టిస్ కన్వీనర్ యెరిపిల్లి నూకరాజు గారు, జనసేన నాయకులు యెరిపిల్లి నూకరాజు గారు,బడి పార్వతిరావు, ఏరిపిల్లి సోమురు,జనసేన వీరమహిళ బడి మంగవేణి, బడి రాజు, పల్లెటి జగదీష్, కోవీరి సోమేశ్, తదితరులు పాల్గొన్నారు.