అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామంలో ఉన్న అంగన్ వాడి స్కూల్ కి తాళాలు వేసి గ్రామ ఎస్‌సి కాలనీ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అబివృద్ధి సంస్థ ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ను 233226 నెంబర్ తో 06 డిసెంబర్ 2021 న జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ లో ఎస్‌సి మరియు ఎస్‌టి హాబీటేషన్స్ నందు ఉండు ఎస్‌సి మరియు ఎస్‌టి అభ్యర్థులు మాత్రమే అప్ప్లై చేసుకోవడానికి వీలుందని అన్నారు. చట్టం ప్రకారం అన్ని అర్హతలు ఉన్న ఎస్‌సి నిరుద్యోగ యువత ఈ పోస్టులకు అప్ప్లై చేసుకున్నామన్నారు. కానీ చట్టానికి వ్యతిరేఖంగా ఎస్‌సి పరిధిలో ఉన్న అంగన్ వాడీ కేంద్రానికి ఎస్‌సి అభ్యర్థులను కాకుండా బిసి అభ్యర్థులను నియమించారన్నారు. ఈ వ్యవహారమంతా స్థానిక వైసీపీ నాయకుల కనుసన్నుల్లోనే జరిగిందని అంటున్నారు. గత ఏళ్లుగా ఎస్‌సి పరిధిలో ఉంటున్న ఈ అంగన్ వాడి కేంద్రానికి ఇతర కులాల వారిని నియమించడం ద్వారా మాకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ పై అధికారులు వచ్చి సమస్యకు పరిష్కారం అందించేవరకూ తాళాలు తీయబోమని అన్నారు. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. త్వరలోనే కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, అలసత్వం వహిస్తున్న అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. ఈ విషయం తెలుసుకున్న కుడేరు CDPO కార్యాలయం నుండి ఒక అధికారి వచ్చి ఎస్‌సి కాలనీ ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కాలనీ వాసులు నిరసనను ఆపకపోవడంతో, పై అధికారులకు సమస్యను తీసుకెళ్తానని ఆమె చెప్పారు.