గజపతినగరం ( జనస్వరం ) : పాసిలవలస గ్రామంలో పల్లెపల్లెకు జనసేన కార్యక్రమాన్ని ఆ గ్రామ సుంకరి శివ మురళి మరియు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ నూతన రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యురాలు (PAC), మాజీమంత్రి వర్యులు పడాల అరుణ విచ్చేయడం జరిగింది. అరుణ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న అధికార పార్టీ మన రాష్టాన్ని అప్పుల్లోకి నెట్టిన విషయం తెలిసినదే. కనుక 2024లో జనసేనపార్టీ అధికారంలోకి వచ్చేవిధంగా మనందరం కలసి పనిచేయాలని మన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ గారిని సిఎంగా చూడాలని అందరని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల శరత్, గజపతినగరం మండల అధ్యక్షులు, మునకాల జగన్, దత్తిరాజేరు మండల అద్యక్షలు చప్ప అప్పారావు, ప్రచార కార్య నిర్వహణ సభ్యలు మామిడి దుర్గాప్రసాద్, చీపురుపల్లి ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్, జనసేన నాయకులు త్రివేది, ప్రవీణ్, రామకృష్ణ, రమేష్, గ్రామ ప్రజలు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com