Logo
Date of Publish : 19 July 2022, 9:52 am
Editor : Sake Naresh

గజపతినగరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం

        గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ గజపతినగరం నియోజకవర్గంలో చేబడుతున్న పల్లెపల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా 20వ రోజు ఎం. కొత్తవలస గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా మా జనసైనికులు, నాయకులతో ప్రతీ ఇంటిఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలతోను, జనసేన పార్టీ చేబడుతున్న కార్యక్రమాల వివరాలతో కూడియున్న కరపత్రాలను ప్రజలకు వివరిస్తూ పంచిపెట్టామని అన్నారు. ప్రజలంతా ఎన్నో సమస్యలను అడగకముందే చెప్పి వాపోతున్నారని, అర్హులమైనా పెన్షన్లు గాని, ఇల్లులు, డ్వాక్రా రుణ సదుపాయాలు కల్పించట్లేదని, అదే రైతుల గోడు ఐతే వర్ణణాతీతమని పంటలకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని, విత్తనాలకైతే డబ్బులు ముందు కడితేగాని తేవడం లేదని అన్నారు. రైతుభరోసా కేంద్రాలు ఎందుకు పెట్టారో, ఎప్పడూ మూసివేసే ఉంటాయని ప్రజలంతా ఇటువంటి ఎన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారని అన్నారు. రైతులకు భాదించిన ఏ ప్రభుత్వం బట్టకట్టలేదని, జనసేన ప్రజల పక్షాన నిలబడి జిల్లా కలెక్టర్ కు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి ప్రజలకు న్యాయం జరిగే వరకు మావంతు కృషిచేసి పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు, మిడతాన రవికుమార్, రామకృష్ణ (బాలు)రమేష్ రాజు, త్రినాథ్, పండు, హరీష్ నాని, శ్రీనుకడమల, ఆదినారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com