గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కొల్లాగుంట పంచాయతీ, కొల్లాగుంట గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం (భవిష్యత్తు గ్యారెంటీ) జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలిపారు. అందని ద్రాక్ష పండులా మిగిలిపోయిన గ్రామ అభివృద్ధిని అధికారంలోకి వచ్చిన వెంటనే మేము దగ్గరుండి గ్రామాల అభివృద్ధికి పాటు పడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భముగా కొల్లాగుంట గ్రామాన్ని మొదటి విడతలోనే ఆదర్శ గ్రామం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఈ గ్రామంలో మురుగునీటి వ్యవస్థను లేదని, మంచి రోడ్డు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లంతా రోడ్ల మీదనే నిలిచిపోయి, గ్రామస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా గ్రామంలో సర్వరంగ సమగ్రాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీలకు ఒక అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మూడవ అతిపెద్ద నియోజకవర్గంగా తీసుకొస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, మండల ఉపాధ్యక్షులు సెల్వి, నియోజకవర్గ కార్యదర్శి నర్సింగ్ లోకేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నరేష్ , కార్వేటి నగరం మండలం బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, కాపు యువసేన కార్వేటినగరం మండల అధ్యక్షులు వెంకటేష్,పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, కొట్టార్వేడు గ్రామపంచాయతీ అధ్యక్షులు వినోద్, జనసేన పార్టీ నాయకులు,రుద్ర, అజిత్, వడివెల్, గజేంద్ర పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com