విజయవాడ ( జనస్వరం ) : విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ సమక్షంలో తిరునగరి ప్రకాష్ కుమార్ మరియు 10మంది పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంత భావజాలానికి, రాబోయే రోజుల్లో రాష్ట్ర దశాదిశా నిర్దేశించే విధంగా పోరాటం చేస్తున్న విధానానికి ఆకర్షితులై పార్టీలో పశ్చిమాన పెద్ద ఎత్తున చేరుతున్నారని మహేష్ తెలియజేశారు. తిరునగరి ప్రకాష్ కుమార్ తో పాటు పదిమందికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తొందర్లోనే వీరందరికీ పదవి బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చినారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించామని రెండవ షెడ్యూల్ కొండ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి కొండ ప్రాంత సమస్యలు పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందని తొందర్లోనే షెడ్యూల్ కూడా ప్రకటిస్తామని తెలియజేసినారు. ఈరోజు పార్టీలో తిరునగరి ప్రకాష్ కుమార్ తో పాటు కణిత.శివ సాయి విశ్వనాథ్, ఇందు, శివ సాయికిరణ్, సత్య రెడ్డి, శేఖర్, లీలాధర్ ,హేమంత్, ప్రకాష్ లు చేరినారు. కార్యక్రమంలో 42వ డివిజన్ అధ్యక్షులు తిరపతి అనూష MCA, పిల్లా .రవికుమార్, హుస్సేన్ సాబీంకర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com