Logo
Date of Publish : 02 April 2022, 9:31 am
Editor : Sake Naresh

విజయవాడ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం

            విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు పొట్నూరి. శ్రీనివాసరావు, ఏలూరు. సాయి శరత్‌, కె ఎస్‌ ఎన్‌ మూర్తి, నూనె సోమశేఖర్‌, రాజా నాయుడు, రామ నాయుడు ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్‌ పాల్గొన్నారు. పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధిపతి శని అయి వున్నందున ఈ ఏడాది కూడా ప్రజలకు కష్టాలు ఇబ్బందులు తప్పవని, సకాలంలో వర్షాలు కురిసినా పంటలు పెరిగిన ధరల మాత్రం విపరీతంగా పెరుగుతాయని, జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు పవన్‌ కళ్యాణ్‌పై పట్ల సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతుందని, జనసేన పార్టీ ప్రజల్లో మరింత విశ్వాసాన్ని చూరగొంటుదని తెలిపారు. తద్వారా పార్టీ నాయకులకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మహేష్‌ కి రాజ్యపూజ్యం బాగా పెరుగుతుందని ఆదాయం బాగా ఉంటుందని ప్రజల్లో ఆదరణ బాగా పెరుగుతుందని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com