
విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు పొట్నూరి. శ్రీనివాసరావు, ఏలూరు. సాయి శరత్, కె ఎస్ ఎన్ మూర్తి, నూనె సోమశేఖర్, రాజా నాయుడు, రామ నాయుడు ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధిపతి శని అయి వున్నందున ఈ ఏడాది కూడా ప్రజలకు కష్టాలు ఇబ్బందులు తప్పవని, సకాలంలో వర్షాలు కురిసినా పంటలు పెరిగిన ధరల మాత్రం విపరీతంగా పెరుగుతాయని, జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు పవన్ కళ్యాణ్‌పై పట్ల సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతుందని, జనసేన పార్టీ ప్రజల్లో మరింత విశ్వాసాన్ని చూరగొంటుదని తెలిపారు. తద్వారా పార్టీ నాయకులకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ కి రాజ్యపూజ్యం బాగా పెరుగుతుందని ఆదాయం బాగా ఉంటుందని ప్రజల్లో ఆదరణ బాగా పెరుగుతుందని తెలిపారు.