
విజయవాడ, (జనస్వరం) : విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ పటమట అంబేద్కర్ నగర్ కు చెందిన ఏడుగురు విద్యార్థులు కృష్ణా నదిలో స్నానానికి వెళ్ళగా వారిలో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు మృతి చెందగా ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఆ భగవంతుడు మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. అలాగే అమ్మిశెట్టి వాసుతో పాటు జనసేన పార్టీ 14వ డివిజన్ అధ్యక్షులు ఎడ్లపల్లి నాగరాజు, 19వ డివిజన్ అధ్యక్షులు హరిప్రసాద్ మృతుల కుటుంబానికి పరామర్శించడం జరిగింది. ఈ సంధర్భంగా వాసు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కొక్క బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు. గల్లంతయిన వారు పటమట చెందిన కె. వి. సి జడ్పీ స్కూల్ విద్యార్థులు ఎస్. కే. బాజీ, దూదేకుల హుస్సేన్, తోట కామేష్, మద్దాల బాబు, మున్నాలుగా గుర్తించారు.