Logo
Date of Publish : 19 September 2022, 8:29 am
Editor : Sake Naresh

విజయవాడ 51వ డివిజన్ జనసేనపార్టీ కమిటీ సభ్యులు ఆత్మీయ సమావేశం

     విజయవాడ, (జనస్వరం) : నగరంలో 51వ డివిజన్ జనసేనపార్టీ డివిజన్ అధ్యక్షులు బత్తుల వెంకటేష్ అధ్వర్యంలో పొతిన మహేష్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ గెలుపునకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలన్నారు. జనసేనపార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలియజేశారు. కమిటీ సభ్యులు సైతం సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన మహేష్ ఖరారుపై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పార్టీ జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎక్కడైతే దెబ్బతిన్నామో అక్కడినుంచి తన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన మహేష్ ను గెలిపించేందుకు తన తొలి అడుగు వెయ్యనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పశ్చిమ నియోజకవర్గంలోని జనసైనికులు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com