
విజయవాడ, (జనస్వరం) : నగరంలో 51వ డివిజన్ జనసేనపార్టీ డివిజన్ అధ్యక్షులు బత్తుల వెంకటేష్ అధ్వర్యంలో పొతిన మహేష్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ గెలుపునకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలన్నారు. జనసేనపార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలియజేశారు. కమిటీ సభ్యులు సైతం సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన మహేష్ ఖరారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పార్టీ జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎక్కడైతే దెబ్బతిన్నామో అక్కడినుంచి తన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన మహేష్ ను గెలిపించేందుకు తన తొలి అడుగు వెయ్యనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పశ్చిమ నియోజకవర్గంలోని జనసైనికులు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.