విజయనగరం ( జనస్వరం ) : మహాకవి గురజాడ అప్పారావు 106వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్విని, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళ, రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి శ్రీమతి కాటం అశ్విని మాట్లాడుతూ నవయుగ వైతాళికుడు, కాలాన్ని జయంచిన మహానుభావుడు మహాకవి గురజాడ అప్పారావు అని అభివర్ణించారు. ఆయన రచనలు పుత్తడిబొమ్మ, కన్యాశుల్కం మొదలైనవి యావత్తు ప్రపంచ మానవజాతికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి కాదని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, గేదెల సాయి కుమార్, గంధవరపు రఘు, కందివలస భాష, బూర వాసు, రాగోలు సాయి కిరణ్, కిలారి వినయ్, పాల్గొన్నారు.