
విజయనగరం నియోజకవర్గంలో స్థానిక 19వ వార్డులో సుమారు 25మంది యువకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలో శ్రీమతి పాలవలస యశస్వి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. పాలవలస యశస్వి గారు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.