కళ్యాణదుర్గం, ఏప్రిల్ 05 (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలం, "ఎరడికెర" గ్రామపంచాయితీలో జనసేన+టిడిపి+బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి జనసేన+టిడిపి ఇంటింటా ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మేనిఫెస్టో అంశాలను, సూపర్ సిక్స్ పథకాలను వివరించడం జరిగింది. జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ సూచనలతో ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ జనసేన వీరమహిళలు షేక్ తార, మమత, కల్పన, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు అనిల్ పాల్యం, చిత్తప్ప, బ్రహ్మసముద్రం మండల కార్యదర్శులు ఎరడికెర క్యాతన్న, ఎరడికెర సురేష్, బుడిమేపల్లి K.T.తిమ్మరాజు, ఒకిల్ రాజన్న, బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ తరఫున పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన-టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com