కళ్యాణదుర్గం, ఏప్రిల్ 02 (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గం, శెట్టూరు మండలం, ములకలేడు పంచాయతీలో జనసేన+టిడిపి+బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి జనసేన+టిడిపి ఇంటింటా ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను, మేనిఫెస్టో అంశాలను ఇంటింటికి వివరించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ శెట్టూరు మండల అధ్యక్షులు కాంత్ రాజు, మండల ఉపాధ్యక్షులు మహేష్, టిడిపి మండల అధ్యక్షులు T.R.తిప్పేస్వామి, నియోజకవర్గ జనసేన వీరమహిళలు షేక్ తార, మమత, కల్పన, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు రాజు, అనిల్ పాల్యం, చిత్తప్ప, రుహుల్ల, లోకేష్, శివ, శెట్టూరు మండలం జనసేన పార్టీ నుండి చెర్లోపల్లి మంజునాథ్, ఈడిగ బాబు, కళ్యాణదుర్గం నియోజకవర్గ మీడియా ఇంచార్జ్ రాయుడు, జనసేన+టిడిపి కార్యకర్తలు, నాయకులు, ఆడపడుచులు, అభిమానులు పాల్గొన్నారు.