• కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ని గెలిపించు కుందాం.
• 20వ డివిజన్ లో కొనసాగిన కూటమి ఉమ్మడి ప్రచారం.
• ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత, దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి
అనంతపురం, ఏప్రిల్ 12 (జనస్వరం) : శుక్రవారంనాడు అనంతపురం అర్బన్ నియోజక వర్గంలోనీ స్థానిక 20వ డివిజన్ లో కూటమి ఉమ్మడి ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారంలో జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి సతీమణి శ్రీలక్ష్మి పాల్గొని దగ్గుపాటి ప్రసాద్ కి ఓటు వేయాలని అభ్యర్థించింది. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ముఖ్యమైన అంశాలైన ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, స్కూల్ కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15వేల రూపాయల ఆర్థిక సహాయం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, యువతకి ప్రతి ఏడాదికి 20లక్షల ఉపాధి అవకాశాలు వంటి అంశాలను వివరిస్తూ.. అనంతపురం అర్బన్ నియోజక వర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన అవినీతి అనంత వెంకటరామిరెడ్డి ని ఓడించి దగ్గుపాటి వెంకట ప్రసాద్ ని గెలిపించుకొని రాష్ట్రంలో కూటమి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ బోయ సరోజమ్మ, పార్వతి, వీరమహిళలు శైలజ, గురు లక్ష్మి, గాయత్రి, మునెమ్మ, జనసేన నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, నాయకులు హనుమప్పా, చెన్నమ నాయుడు, సాయి పవన్, గణేష్, ఆది, సత్తార్, ఆది, మల్లికార్జున, గౌతమి, యామిని తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com