Logo
Date of Publish : 02 October 2021, 5:26 pm
Editor : Sake Naresh

భరతమాత తల రాతను మార్చిన విధాత “గాంధీ” – సత్యం, అహింస, సిద్ధాంతాలను ఆచరించి నాడే గాంధీజీకి నిజమైన నివాళి – విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్

భరతమాత తల రాతను మార్చిన విధాత "గాంధీ"
- సత్యం, అహింస, సిద్ధాంతాలను ఆచరించి నాడే గాంధీజీకి నిజమైన నివాళి
- జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్
      విజయవాడ, (జనస్వరం) : మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలకు జనసేన పార్టీ నాయకులు భక్తుల వెంకటేష్, ఆలమూరు సాంబశివ రావు ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ భరతమాత తల రాతను మార్చిన విధాత అని, గాంధీ సత్యం, అహింస శాంతి మార్గాలు సూచిస్తే నేడు వైసీపీ ప్రభుత్వం మాత్రం అసత్యం హింస అశాంతి అన్యాయాలు అక్రమాలు అవినీతి మార్గాలు ఎంచుకొని పాలన సాగిస్తుందని, రోడ్డు సెస్ ద్వారా ప్రజల వద్ద నుండి ఒక రూపాయి చొప్పున ప్రతి లీటర్ డీజిల్, పెట్రోల్ అమ్మకాలపై భారం మోపి1500 కోట్లు రూపాయలు జగన్ రెడ్డి ప్రభుత్వం వసూలు చేసిందని కానీ కేవలం గోతులు పడ్డా రోడ్ల మరమ్మతులు కోసం 200 కోట్ల రూపాయలు మంజూరు చేశారని మిగిలిన 1300 కోట్ల రూపాయలు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీజీ జయంతి ఒక్కరోజు ముందున్న బ్రాందీ పాలసీ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి గాంధీజీకి నివాళులర్పించిన అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు శరత్, బడార్ల శివ, రమణారెడ్డి, బొట్ట సాయి, నల్లబిల్లి కనకరావు, రేఖపల్లి శ్రీనివాసరావు,రాము, రామచందర్రావు, మదన్ కుమార్, రాజు, దేవానంద్, బావిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com