సొమ్మొకరిది, సోకు ఇంకొకరిది అన్న చందంగా వైస్సార్సీపీ పాలన : పాలవలస యశస్వి

పాలవలస యశస్వి

      విజయనగరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వ పాలన, సంబంధిత మంత్రుల పనితీరు చూస్తుంటే వైస్సార్సీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్దిచెప్పే రోజులు ఎంతోదూరం లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా గాణగంధర్వుడు గంటసాల వారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా కాకుండా దివాళా తీసిన రాష్ట్రంగా తీర్చిద్దేందుకు వైస్సార్సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ప్రభుత్వ పాలన తీరుపై యశస్వి మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పిఆర్సీపై తుంగలో తొక్కి ఉద్యోగస్తులకు మొండిచేయి చూపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులను మబ్బిపెట్టి, మశిబూసీ మారేడుకాయ అన్న చందంగాచేసి కొందరి ఉద్యోగస్తులను, ఉపాద్యాయులను ఇబ్బందులు పెడుతూ, రాష్ట్ర మంత్రుల జోక్యం చేసుకొని ఇస్తామన్న హామీను పక్కన పెట్టి అభద్రతా భావం కలిగేలా చేశారు.

              రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే రైల్వే ప్రాజెక్టులు పూర్తికావడం లేదని, అందుకే కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ సగంలో ఆగిపోయిందని, కేంద్రప్రభుత్వంతో కలిసి చేసిన అన్నిప్రొజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇరువైఐదు శాతం పెట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులు నీరుగార్చేలా చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర పాలన ఇలాంటి క్లిష్టమైన పరిస్ధితుల్లో ఉంటే ఓవైపు గౌరవ మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు పోలీసుఅధికారి పై, ఒరౌడీలా, గూండాలా పలుకలేని పదజాలంతో అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఖచ్చితంగా పోలీసులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే మంత్రి పై వ్యక్తిగతంగా కేసుపెడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు ఖచ్చితంగా జనసేన చెక్ పెడుతుందని ,ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలిసేలా ఎండగడుతూ ప్రతీ నియోజకవర్గం,అన్ని జిల్లాల్లో జనసేన జనాల్లోకి తీసుకెళ్లటమే కాకుండా ఇలా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తామని అన్నారు. ఈ సమావేశంలో అమెతోపాటు జనసేన ఝాన్సీ వీరమహిళ మాతా గాయత్రీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), లాలిశెట్టి రవితేజ, యర్నాగుల చక్రవర్తి, కార్పొరేట్ అభ్యర్థులు లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, మిడతాన రవికుమార్, తాతపూడి రామకృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way