Logo
Date of Publish : 22 September 2021, 7:13 am
Editor : Sake Naresh

వైస్సార్సీపీ దౌర్జన్యాలను, ఒత్తిడి ని ఎదుర్కొని పోరాడి గెలిచిన వీర మహిళ మౌనిక గారు – నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్

         నెల్లూరు, (జనస్వరం) :  నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు బిట్ - 5 లో ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన తరపున గెలుపొందిన మౌనిక గారి అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ మనుక్రాంత్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గ నాయకులు అధికార పార్టీ నాయకులు చేసిన దౌర్జన్యాల గురించి, ఒత్తిడులు గురించి, తమ స్థానిక సమస్యల గురించి మనుక్రాంత్ గారికి విన్నవించుకోవడం జరిగింది. మనుక్రాంత్ గారు వాటిపై స్పందిస్తూ స్థానిక సమస్యలపై ఎటువంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధం అని, సమస్యల పరిష్కారానికి అందరం కలిసి పోరాడదామని చెప్పారు. అంతే కాకుండా కార్యకర్తలని, నాయకులను అధికార పార్టీ వాళ్ళు ఇబ్బందులకు గురిచేసినా, దౌర్జన్యాలు చేసిన తన దృష్టికి తీసుకురావాలని, వైసీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకొనని, వారిపైన న్యాయ పోరాటం చేస్తానని, అందుకు మన దగ్గర లీగల్ సెల్ ఉందని చెప్పారు. త్వరలోనే లీగల్ సెల్ ని మండల స్థాయి వరకు విస్తరింపజేస్తానని.. మీకు ఎటువంటి సమస్య వచ్చిన మీకు అండగా ఉంటానని ఉదయగిరి నాయకులకు భరోసా ఇచ్చారు. వింజమూరు బిట్ - 5 లో వైస్సార్సీపీ ఆగడాలు ప్రజలే తిప్పికొట్టి జనసేనను గెలిపించారని అన్నారు. మౌనిక గారికి ఓటు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com