మండల పరిషత్ సమావేశంలో అధికారులను నిలదీసిన వైస్ ఎంపీపీ ఆనందరాజు

    రాజోలు, (జనస్వరం) : మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పలు ప్రశ్నలను సంధించిన రాజోలు మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఇంటిపల్లి ఆనందరాజు. పలు అంశాలపై ఈ సమావేశంలో మొదటిగా విద్యాశాఖపై  జాతీయ రహదారి పక్కనున్న స్కూల్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని అన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా MPDO కి ఇటీవల ONGC కి పర్యావరణ చర్యలపై 22 కోట్లు చెల్లించాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని వీటిలో కొంత సొమ్ము రాజోలు ఏరియా హాస్పిటల్ నందు డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు కేటాయించాలని మండల పరిషత్ లో తీర్మానం చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని MPDOని కోరడం జరిగింది. అంతేకాకుండా రవాణా శాఖపై మాట్లాడుతూ రాజోలు బస్టాండ్ నుండి సాయంత్రం ఐదు గంటలకు పాలకొల్లు, రైల్వే స్టేషన్ బయలుదేరి ఆర్టీసీ బస్సు రైల్వే స్టేషన్ వెళ్లే ప్రజలకు సరిపోవడం లేదని మరొక బస్సు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. రహదారులు మరియు భవనాల శాఖపై కూడా మాట్లాడుతూ పలు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కనీసం రోడ్లు మరమ్మతులు అయిన చేపట్టాలని కోరడం జరిగింది. అలాగే చింతలపల్లి గ్రామం పోతుమట్ల ఆంజనేయస్వామి గుడి దగ్గర నుండి రుద్రవారి మెరక వినాయకుడు దగ్గర వరకు ఆర్ఎంబి రోడ్డు వెయ్యాలని కోరడం జరిగింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడుతూ చింతలపల్లి గ్రామంలో కాలవల శుభ్రత చేయాలని కోరడం జరిగింది. మండల అధ్యక్షులు వారికి కూడా పలు అంశాలు తెలుపుతూ నా పరిధిలో MPP school పిప్పళ్ళ వారి మెరక నా స్కూలుకి పిల్లలకు రక్షణగా ప్రహరీ గోడ నిర్మించాలని తీర్మానంలో ఏర్పాటు చేయాలని ఆనంద రాజు కోరడం జరిగింది. అదే విధంగా పోలీస్ శాఖ వారికి కూడా పలు అంశాలు విన్నవించారు. నెంబర్ బోర్డు లేని మోటార్ సైకిల్ సీజ్ చేయాలని మరియు వేగ నియంత్రణ జరక్కుండా చూడాలని పోలీస్ శాఖ వారికి తెలపడం జరిగింది. దేవాదాయ, ధర్మదాయ శాఖ వారికి తెలుపుతూ చింతలపల్లి గ్రామంలో పూర్వం నిర్మించబడిన శివాలయం కోసం పై అధికారులకు తెలియపరిచి మళ్లీ కొత్తగా నిర్మించాలని కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way