- జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి, నగర అధ్యక్షుడు పోతిన మహేష్
విజయవాడ, (జనస్వరం) : వారాహి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విజయవంతం అయినందుకే వైసీపీ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు డైరెక్షన్లో చీరల కాంట్రాక్టర్ సంపర శ్రీనివాసరావు విషం చిమ్మే ప్రయత్నం చేసి చీర అంశాన్ని రాజకీయం చేశారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి, నగర అధ్యక్షుడు పోతిన మహేష్ అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వారాహి ప్రచార రథానికి నిమ్మకాయ కూడా టైర్ కింద పెట్టని సదరు కాంట్రాక్టర్ పవన్ కళ్యాణ్ కి చీర బహుమతిగా ఇస్తారా? బహుమతిగా ఇవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాలి కదా, చీరల కాంట్రాక్టర్ సంపర శ్రీనివాసరావు వైసీపీకి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి బ్యానర్లు కడుతూ ఉంటారు. ఈ విషయం విజయవాడ నగరంలో అందరికీ తెలుసు, చీర విలువ విషయంలో కూడా ఎవర్ని సంప్రదించకుండా, వారాహి ప్రత్యేక పూజలు కోసం అమ్మవారి ఆలయం విచ్చేసిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ఆ కార్యక్రమం విజయవంతం చేసినందుకు తన మీద రాజకీయం చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. కానీ అమ్మవారి దయ మా మీద ఉంది అమ్మవారి కరుణ కటాక్షాలు తమ మీద ఉన్నాయని, దుష్టశక్తులు మా మీద ఎన్ని దుష్ప్రచారాలు చేయాలని ప్రయత్నం చేసిన విషం కక్కిన చివరికి విజయం మాదేనన్నారు. అమ్మవారికి చీర సమర్పించిన ఒక గంటలోపే రసీదు రాసి విలువ తక్కువ చేసి బహిర్గతం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. గతంలో ఏనాడైనా ఇలా జరిగిందా సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, గవర్నర్ వచ్చినప్పుడు ఇలా ఎందుకు బహిరంగంగా రసీదు రాసి ప్రచారం చేయలేదని, ఇందులో చీరాల కాంట్రాక్టర్ సంపర శ్రీనివాసరావు కుట్రని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ఈవో సెలవు పెట్టి నాలుగు రోజులు బయటికి వెళ్లిన సమయంలో ఇతను రాజకీయం చేసి అమ్మవారికి పవన్ కళ్యాణ్ సమర్పించిన చీర అంశాన్ని కావాలనే దుష్ప్రచారం చేయాలని పన్నాగం పన్నారని తెలిపారు. ఇదంతా వెల్లంపల్లి శ్రీనివాసరావు డైరెక్షన్లోనే చేశారని తెలియజేశారు. అమ్మవారి ఆలయంలో చీరల కాంట్రాక్టర్ రాజకీయం చేస్తున్నందున అతనిపై ఈవో విచారణ చేపట్టాలని, దొంగ చీరలు అమ్ముతూ దుర్గమ్మ భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతిస్తున్న కాంట్రాక్టర్ సంపర శ్రీనివాసరావు పై చర్యలు తీసుకోవాలని, హిందువుల మనోభావాలను ఘోరంగా అవమానిస్తున్నా కాంట్రాక్టర్ ను తక్షణమే సస్పెండ్ చేసి బ్లాక్‌లిస్టులో పెట్టాలని, చీరలు అమ్మవారికి కట్టినవి కావని, బయటనుంచి లిఫ్ట్ మార్గంగా తీసుకువచ్చి స్టాల్లో పెట్టి భక్తులను మోసం చేస్తూ పెద్ద ఎత్తున మాయ చేస్తూ అక్రమంగా అమ్మవారి భక్తుల దగ్గర దోచుకుంటున్నారని, అందుకు సంబంధించిన ఫోటోలు సాక్షాలను విడుదల చేస్తున్నామని, ఈ వైసీపీ సంపర శ్రీనివాసరావు చీరల కాంట్రాక్టర్ అసలు రెండు విక్రయ కేంద్రాలు ఎందుకివ్వాలని, ఒకటి అంతరాలయం బయట మరొకటి ఘాట్ రోడ్డు ఓంకారం మలుపు వద్ద, వీటికి అద్దె వసూలు చేస్తే ఒక్కొక్క షాప్ కి నెలకి రూ.10 లక్షల చొప్పున రెండు షాపులకి రూ.20 లక్షలు ఏడాదికి రూ.రెండు కోట్ల 40 లక్షలు అద్దె వసూలు చేయాలని, కరోనా కి ముందు ఆలయ అధికారులే చీరల విక్రయం చేపట్టే వారిని ఆ సమయంలో ఆలయానికి రూ.నాలుగు కోట్ల 80 లక్షల ఆదాయం వచ్చేదని కరోనా వంకతో కావాలని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అండదండలతో కేవలం రూ.మూడు కోట్ల 40 లక్షల కే కాంట్రాక్ట్ కొట్టేసి అమ్మవారి ఆలయ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టారని, వీరి దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని, వారం రోజుల కిందట అగరబత్తి అమ్మకాల షాప్ కు ఐదు బై ఐదు షాపునకు నెలకు రూ.1,52,000 అద్దె ఖరారు చేశారు. మరి ఇతని దగ్గర 15 .20 వెడల్పు గల 2 షాపులకు ఎంత అద్దె వసూలు చేయాలని, జీఎస్టీ వసూలు విషయంలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయని దీనిపై కూడా భక్తులకు పూర్తి వివరాలు అందజేయాలని, ప్రతి చీర ఎంఆర్ రిజిస్టర్ లో ఎంటర్ అవుతుందా లేదా ప్రతి చీరకు నెంబర్ వేస్తున్నారా లేదా అనే అంశంపై ఈవో విచారణ చేపట్టాలని, ఆర్ సిల్క్ చీర బయట రూ.250 రూపాయలు కానీ అమ్మవారికి కట్టామని భక్తుల మోసం చేస్తూ కాంట్రాక్టర్ రూ.800లు వసూలు చేస్తున్నారని సదర్ కాంట్రాక్టర్ మోసాలపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టాలని, ఈవో కాంట్రాక్టర్ ముసుగు వేసుకొని రాజకీయం చేస్తున్న సదర్ కాంట్రాక్టర్ సంపర శ్రీనివాసరావు అండ్ కోపై తక్షణమే చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో వచ్చేవారం పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు. అదేవిధంగా ఆలయపాలక మండల్లో నాయి బ్రాహ్మణులకు స్థానం కల్పిస్తామని ప్రత్యేక ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా విడుదల చేయించిన రోజునే నాయి బ్రాహ్మణులను మోసం చేసిన చరిత్ర సీఎం జగన్ గదని వారు తక్షణమే నాయి బ్రాహ్మణ క్షమాపణ చెప్పాలని, ఈ అంశంపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించాలని డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com