
సుండుపల్లి, (జనస్వరం) : జనసేన నాయకులు ఎం వెంకటేశ్వరరావు పార్టీలో చేరిన తరువాత మొదటి సారి సుండుపల్లి మండలానికి రావడంతో ఆయనకు మండల జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు శాలువతో సత్కరించి పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. జనసేనపార్టీ నాయకులు రామశ్రీనివాసులు ఆధ్వర్యంలో సుండుపల్లి మండల ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన నేత ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వివిధ సామాజిక వర్గాల నేతల వారిని కలవడంతో పాటుగా భావితరాల భవిష్యత్తు కోసం జనసేనపార్టీ అహర్నిశలు భాద్యతగా ముందుకు వెళ్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మనుగడ మార్పు కోసం ఒక అవకాశం జనసేనపార్టీకి ఇవ్వండి అని పిలుపునిచ్చారు. అలానే నిరంతరం రద్దీగా ఉండే రాయచోటి, సుండుపల్లి మధ్య రహదారి హెచ్చుతగ్గులు గుంతల మాయమై కొత్తగా ఏర్పాటు చేస్తున్న కల్వర్టులు వద్ద హెచ్చరిక బోర్డ్లు లేక అభద్రతా భావంతో చాలా రకాల సమస్యలు పడుతూ ఆ రహదారిపై రాకపోకలకు వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున సంబంధిత ప్రభుత్వ అధికార యంత్రాంగం వారు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల జనసేనపార్టీ నాయకులు, ఓబులేసు, రాజగోపాల్, వీరమహిళ రెడ్డిరాణి, మున్నా జనసైనికులు, సుండుపల్లి మండల చిరంజీవి యువత అధ్యక్షుడు రవీంద్ర, మెగా డిజిటల్ అధ్యక్షుడు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.