రాజంపేట ( జనస్వరం ) : అంగన్ వాడిల న్యాయ మైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు. గురువారం రాజంపేట పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు, ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో పదవ రోజు అంగన్వాడి వర్కర్లు ఆయాలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. పది రోజులుగా అంగన్వాడి వర్కర్లు సమ్మె నిర్వహిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. వారికి కనీస వేతనం 26,000 ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే మీకు జీతాలు పెంచుతానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు జీతాలు పెంచకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వారి న్యాయమైన సమస్యల కోసం సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు. అంగన్వాడీలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన బహిరంగ సభలో టిడిపి జనసేన పార్టీ 2024లో ఉమ్మడిగా ప్రభుత్వం చేపడుతుందని చేపట్టిన వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. రాబోవు 2024 ఎన్నికలలో ప్రజలందరూ జనసేన, టిడిపి పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలన్నారు. ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పను మడమ తిప్పను అన్న నినాదం ఈరోజు సమస్యలు పరిష్కరించడంలో ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరికీ ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఉద్యోగస్తులు నిరుద్యోగులు యువత ఆలోచించి 2024 ఎన్నికలలో టిడిపి జనసేన పార్టీలను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కత్తి సుబ్బరాయుడు, భాస్కర్ పంతులు , కోత్తూరు వీరయ్య ఆచారి, చౌడయ్య, గోవర్ధన్ ఆచారి, జనసేన వీర మహిళలు రజిత, శిరీష, సిఐటియు, ఏఐటీయూసీ నాయకులు చిట్వేల్ రవికుమార్, ఎమ్ ఎస్ రాయుడు, సికిందర్ అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com