
అనకాపల్లి జిల్లా, (జనస్వరం) : పాయకరావుపేట మండలలోని వెంకటనగరం గ్రామానికి చెందిన పలువురు పార్టీ కార్యకర్తలు జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు జనసేనపార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అదే గ్రామానికి చెందిన గరికిన శ్రీను ఆధ్యర్యంలో గ్రామంలోని రామాలయ యువజన సేవా సంఘం యూత్ 50 మంది యువకులు పార్టీ చేరినట్లు గెడ్డం బుజ్జి తెలిపారు.